Saturday 17 December 2011

Naa Jnapakalu 5

నా జ్ఞాపకాలు 5
మా గురించి  సమాజంలో రక రకాల వ్యాఖ్యానాలు. అన్ని తట్టు కున్నాం. భాగావాంజి అనుగ్రహమే మాకు సర్వాలంబనం. అశ్రామానికి వచ్చాక జీవితం క్రమభద్దమైంది. కాలం జరుగుతున్నది, ప్రతి రోజు శ్రీ స్వామివారు వేదాంత గ్రంధాలపై భోధనలు చేసేవారు. శంకర మటంలో ఏ సౌకర్యం లేక పాయినా మేము భాధ పడలేదు. ఒకరోజు శ్రీ నెప్పల్లి కుటుంబరాయ శర్మ గారు సతీ సమేతంగా భగవానుల వారి దర్శనానికి ఒచ్చారు. కారులో శర్మగారు (ఆశ్రమం తీసుకుని మటంలో నివసిస్తున్నవారి ) పూర్వాశ్రమ సతీమని శ్రీమతి విజయలక్ష్మి గారు మేము ఉంటున్న క్వార్టర్స్కుకు వొచ్చారు. మాకు ఏ సౌకర్యం లేదని మనసులో అనుకొని వెంటనే నీరు స్టాక్ చేసుకోవడానికి బిందెలు, వంటకు అవసరమైన వన్నీకొని ఇచ్చారు. ఎప్పుడు వుత్చాహంగా వుంటారు. ఆమె పిల్లలకు స్వామీజీ అంటే చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు.  ఆ వయిసులోకూడా ఇదేమిటి ? అదేమిటి ? అంటూ స్వామివారిని గొప్ప గొప్ప విషయాలు అడిగేవారు. స్వామి వాళ్ళ ప్రశ్నలకు సంతోషంగా జవాబులు ఇచ్చేవారు. వాళ్ళు ఇప్పటికి స్వామితో తమకు వున్నా అట్టాచ్మెంట్ చెప్తుంటారు.
    శ్రావణమాసంలో మాకు పరిత్యాగ జీవితం మొదలైతే కార్తీకమాసంలో భగవానుల వారి పుట్టినరోజు.  ఈ సందర్భంగా N K  శర్మ గారు శ్రీ స్వామి వారి అనుమతి కోసం ఒక ఇంజనీరు గారిని శంకర మటంకు పంపారు. అప్పుడు మటంలో పరమగురువు గారు కూడా (భాగావాంజికి సన్యాస దీక్ష ఇచ్చిన వారు ) వున్నారు. సరే funaction కి అందర్నీ రమ్మని ఆహ్వానించారు. జన్మదినోత్సవం చాలాబాగా చేసేరు. విజయలక్ష్మి గారి హడావుడి యింతా అంతా కాదు. అందర్నీ రధంపై ఊరేగించారు, బ్రహ్మ రధం  పట్టేరు.  ఊరి వీధులలో రధంపై ఉరేగుతుంటే  ఆ ఊరి జనం చెట్లపైన డాబాలపైన ఉండి photos తీసారు.  కొద్దికాలానికి గుంటూరు ఓంకార క్షేత్రం వారు స్వామిని క్షే త్రంలో  జరిగే ఉత్సవాలకు రమ్మని ఆహ్వానించారు. అంగీకరించారు శ్రీ స్వామి. పెద్ద మాతాజీని కూడా ఉపన్యాసమివ్వమన్నారు.  మాతాజీ పూర్వాశ్రమం పేరు రుక్మిణి దేవి.  ఆమె M .A ., B .E d ., చేసారు.  గుంటూరులో ప్రసిద్ధిచెందిన హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా పనిచేసారు.  దీక్షా నామం సద్విద్య  ప్రభా దేవి .  ఈ  పేరుతోనే అన్ని వ్యవహారాలు, గుడివాళ్ళు కరపత్రాలను అచ్చు వేయించారు. శ్రీ విశ్వ గురు  విద్యారణ్య స్వామివారి పరివ్రాజికా శిష్యురాలు మాత సద్విద్యా  ప్రభాదేవి గారి ఉపన్యాసం సాయంత్రం 7 గం: అని అచ్చువేసారు.  ఉపన్యాసాలు మొదలయినాయ్.  మాతాజిగారి వంతు వొచ్చింది.  కాషాయి రంగు వస్త్రధారణతో శ్రీ మాతాజీ ఎన్నో వేదాంత విషయాలు వుట్టంకిన్చుతూ గంభీరంగా ఉపన్యాసం ఇచ్చారు. అందరు  ఆమె ఉపన్యాసం విని ఆశ్చర్య పోయారు .
హటాత్గా ఒక పండితుడు (ఎన్నో గ్రంధాలు రాసిన కవి, పండితుడు) stage ఎక్కి ఆసనంపై ఆసీనులై ఉన్న శ్రీ విద్యారణ్య గురుదేవులతో "స్వామీ నేను ఓడి పోయాను ! మీ శిష్యురాలు అమోఘంగా ఉపన్యసించారు. ఏమి గంభీరమైన స్వరం. సంస్కృత శ్లోకాలను అలవోకగా అందంగా చదివారు. కర పత్రాన్ని చూసాను ఒక స్త్రీ వేదాంత విషయాలను ఏంచెపుతుంది అనుకొని నవ్వుకొన్నాను. ఒకప్పుడు వారిని విమర్శించిన వారిలో నేనూ ఒకడినే. నా గర్వం అంతా ఈ రోజుతో పటాపంచలైపాయింది "  అంటూ మాతాజికి తాను వ్రాసిన పుస్తకాలను అందరి ముందు pregent చేసారు. మాతాజీ తోపాటు  పూర్వం హైస్కూల్లో పనిచేసిన టీచర్లు, విద్యనేర్చుకున్న విద్యార్ధినులు, అందారు వచ్చారు సభకు.  మాతాజిని stage మీద చూసి  ఎవరు ?  రుక్మిణి కదూ అని ఒకల్లవైపు ఒకళ్ళు చూసుకొన్నారు. మాతాజీ స్టేజి దిగగానే టేచర్లు, స్తుడేంట్లు, అందరు ఆమెను చుట్టూ ముట్టారు. మాతా సద్విద్యా ప్రభా దేవి అంటే ఎవరో అనుకొన్నాం నీవేనా ! అంటూ ఎంతో సంతోషంగా మాట్లాడరు. ఆశ్రమానికి వొచ్చాక మాతాజీ గారు ఇచ్చిన మొదటి ఉపన్యాసంగూడ ఇదే. 
1970 లో హైదరాబాద్ లో పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విఘ్రహ ప్రతిష్ట....... లక్ష్మి నరసింహస్వామివారి ఉపాసకురాలైన ఒకామె ప్రార్ధనపై శ్రీ స్వామివారు చేసారు. ఆలానే విజయవాడ లో సత్యనారాయణ పురంలో...శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయానికి కుంభాభిషేకం, స్వామివారి చేతులమీదుగా జరిగింది. వేద మంత్రాల ఘోషతో బ్యాండ్ మేళాలతో అత్యద్భుతంగా అలంకరింపబడిన పందిట్లోకి శ్రీ స్వామిని అడుగడుగునా వారి పాదాలపై పుష్పాలు జల్లుతూ ఎంతో దివ్యంగా ఆహ్వానించారు అచటి భక్తులు. ఆ ఉత్సవానికి Dr చలపతి రావు గారు కాంగ్రెస్ పార్టీ MLA కూడా వోహ్హరు. పెద్ద గజమాల స్వామీ మేడలో వేసి స్వామీ మీరు సామాన్యులు కారు. మీలో దివ్య తేజస్సును చూసాను, తమరు ఒక్క నెలరోజులపాటు ఉపన్యాసాలివ్వండి చాలు.  ఆ తరువాత కని విని ఎరుగని ఒక పెద్ద ఆశ్రమం కట్టించి మీకు సమర్పిస్తాం. అన్నారు.  ఇలా ఆయన తో పాటు ఆ ఊరి పెద్దలు కూడా కలసి ఒప్పుకొంది స్వామీ అంటూ వేడుకొన్నారు. కాని స్వామివారు ఎందుకో ఒప్పుకోలేదు. "మంగోల్లు" అను మరొక ఊరిలో శ్రీ అది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసారు. ఏ దేవుని విగ్రహ ప్రతిష్ట అయీన శ్రీ స్వామీ వారు ఎంతో నియమ నిష్టలతో ఒచ్చి మంచినీరు కూడా త్రాగేవారు కాదు. 
ఇలా వారు సంచరించిన కాలంలో ఎన్నో చోట్ల ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్సవాలకు విద్యారణ్య స్వామీ వస్తున్నారా అని ఆ యా  ఊరి కమిటి మెంబర్లను చాలా ముందుగానే అడిగేవారు. తెలియదండి బహుసా రారనుకొంటు న్నాం అనగానే  జనం  లేదు  వారు రావాలి అల్లాగైతేనే మీకు చందాలు ఇస్తాం లేకుంటే లేదు. మీరు మల్లి అడగండి అని మెంబర్ల పై ఒత్తిడి తెచ్చేవారు. స్వామివారిని రమ్మని ఆహ్వానిస్తూ ఎంతో మంది ఉత్తరాలపై ఉత్తరాలు వ్రాసేవారు. దూరప్రాంతాలవారు కారేసుకుని వొచ్చేవారు. రమ్మని ప్రాధేయ పడేవారు.  స్వామివారికి చాలా ఇబ్బందిగా ఉండేది.  చివరకు నాయనా !  ఏమీ అనుకోకండి నాకు  ఎటు రావాలనిపించటంలేదు . ఎందుకని అడిగితే నేను ఏమి చెప్పలేను. ఎప్పుడైనా మళ్లీ రావాలనిపిస్తే మీకు తప్పకుండ తెలియచేస్తాను. నేను రాక పోయానా మీ ఉత్సవాలకు నా ఆశిస్సులు ఎప్పుడూ ఉంటై అని ఓదార్చి పంపే వారు. ఇలా వారి సంచారాలు నిలిచిపోయాయి . 
1971 లో స్తలం కొని నూతన ఆశ్రమానికి శంకుస్థాపన చేసారు ...
మిగతా చరిత్ర ముందు ముందు .....
శ్రీ విశ్వగురు ప్రభ  vol 38 No 1 , నవంబర్ 2011 ఆధారంగా , మాతాజీ గారి దీవెనతో


 


1 comment:

  1. My first visit to Narsaraopet Sri Vidyaranya Ashram has been wonderful. My interactions with the Matajis and Ashramites was an unique experience...

    I am posting the link to the photoes we have taken during the 74th Avataranostavam of Sri Vidyaranya.

    https://picasaweb.google.com/102432740655721147504/VidyaranyaAvataranotchavamNarsaraoPeta?authkey=Gv1sRgCPHj9MquqaKnlwE

    ReplyDelete