Thursday 15 December 2011

Na Jnapakalu 4

" వదామిభగవానహం " స్వామిరూపంలో అనుగ్రహిస్తున్న భగవంతుడనని తెలియదు. తెలిస్తే ఈ ప్రశ్న వేసేవారు కారు. వెంటనే ఆ ఆఫీసర్ అవును స్వామి ఆ తేజస్సు మీలో ఉన్నది.  మీ ఆకర్షణే వేరు.  నేను మీ దర్శనానికి సరిగా 9 గం: వొచ్చాను. ఇప్పుడు 1 గం: ఐంది, ఇంత సేపు ఏ స్వామి దగ్గర ఉండలేదు. మీరు మాట్లాడుతుంటే ఏదో ఆహ్లాదం !వేదాంత రహస్యాలను ఎంత సులభంగా అర్ధమయేట్లు  చెప్పారు.  నేను వచ్చి చాల సేపు అయినా ఇప్పుడే వచ్చినట్లు అనిపిస్తోంది. అజ్ఞానంతో మిమ్ములను పిచ్చిగా ప్రశ్నించాను క్షమించండి అన్నారు.
ఇలా వ్రాసుకుంటూ పోతే ఎన్ని సంఘటనలో....స్వామివారు ఎప్పుడో క్షేత్రానికి వస్తారు. వచ్చినప్పుడల్లా మిస్ కాకుండా దర్శనానికి వెళ్ళేవాళ్ళం . ఇంకా చెప్పాలంటే ఇంట్లో అందరు చిన్న పెద్ద ఇంకా కజిన్స్ అందరు ఏదో మంత్రంవేసినట్లే దర్శనానికి వచ్చే వాళ్ళు. ఎవెరి టైం వారిది. ఎవరు ఎప్పుడు వచ్చినా అందరికి వారి వారికీ తగ్గ భోధలు చేసేవారు. అలానే ఇతర భక్తులకు. సామివారు అందరికి చెప్పే బోధలు మేముకూడా వినేవాళ్ళం. ఒక సబ్జెక్టుగా మాకు ప్రత్యేకించి చెప్పలేదు. ఎప్పుడు ఏదో వ్రాసుకుంటూ భాష్యాలు,గ్రంధాలు చదువుకోవటం చేస్తూ ఉండేవారు. వారు జింక చర్మం వేసుకొని నేలమీద పడుకొనేవారు. చెక్క కమండలం. కొబ్బరి చిప్పతో మంచినీళ్ళు త్రాగటం చేసేవారు.
ఒక రోజు ఉదయం దర్శనానికి వెళ్ళాం. స్వామివారు నేలపై పడుకుని ఉన్నారు. మాకు భయం వేసింది.  ఏమిటండి! ఇలా పదుకునిఉన్నరు? అన్నాం. శరీరం జ్వరగతం ఐంది అమ్మ అన్నారు. మాకు అర్ధం కాలేదు . మాములుగా జ్వరం వస్తే "జ్వరం వొచ్చింది అంటాం" . శరీరం జ్వర గతం అంటున్నారెంటి, విచిత్రంగా ఉందనిపించింది.ఓహో ! జ్వరం వొచ్చింది శరీరానికి, నేను శరీరాన్ని కాదు గదా! ......నేను" అంటే ఆత్మ, ఆత్మకు ఏ వికారము లేదు అని తెలియచెప్పటానికి అల్లా మాట్లాడారని అనిపించింది. తరువాత ఆలోచిస్తే జ్వరం పోవడానికి మందులు తెస్తామన్నాము. వోద్దమ్మ! శరీరం ఇలా ఎంతకాలం అనుభవించవలెనో అంతకాలం అనుభవించని అన్నారు. ఇదేమేటి ఇలా మాట్లుడుతున్నారు అనుకున్నాం. ఇంత జ్వరంలో కూడా చన్నీళ్ళు స్నానం, అనుష్టానం చేసేవారు. చన్నీళ్ళస్నానం జ్వరాన్ని ఇంకా పెంచుతుంది. గుడివాళ్ళు వేడి నీళ్లు ఇవ్వొచ్చుగా! ఏమిటో ఈమనుషులు!.  సరే పొని మనమే ఇంటిదగ్గర నీరుకాచి తెద్దాం అని వేడి నీరు కాచి బుజానపెట్టుకుని గుడివరకు నడచుకుంటూ తిసుకేల్లాం. పడుక్కోవడానికి చాపకుడ తిసుకేల్లాం. కాని స్వామివారు ఏది ఒప్పుకోలేదు. వోద్దమ్మ నేను చన్నీల్లె చేస్తాను, చాపపై పడుక్కోను, జింక చర్మమే నాకు చాప. అని తిరస్కరించారు సున్నితంగా.  ఇలా
 ఒకటిన్నర సంవత్సరం పూర్తికాలేదు, స్వామివారి భోధనల ప్రభావం మా మనస్సుల పై  పని చేసినదేమో భగవంతుడి కైంకర్యానికి మా జీవితాలను అంకితం చేయాలనీ అనుకున్నాం,. స్వామిజీకి మా ఆశయాలను చెప్పాం. వారు చాల ఆశ్చర్యపోయారు ! అమ్మా త్యాగమయ జీవితంలో చాల కష్టాలు ఉంటై. మీ ఇంటిలోవారంతా భాధపడతారు , మీరు బాగా చదువుకుంటున్నారు, ఇంటి దగ్గరే ఉంది కూడా సాధన చేయ్యవొచ్చు. నాకు సొంత ఆశ్రమం లేదు. డబ్బు కూడా నేను ఎవ్వరిని అడుగను. మగవారు సన్యసిస్తే చెట్టు క్రిందనైనా ఉండగల్గుతారు.స్త్రీలకు అలా కాదు ఎన్నో అవసరాలు ఉంటాయి . అవన్నీ మీకు ఎవరు చూస్తారు? ఇలా ప్రోత్సహించలేదు.

స్వామీ అన్నిటికి మీ పాదాలను ఆశ్రఇంచామ. భగవద్భారతిలో మీరు చెప్పిన ఉపదేశాలు గట్టిగా నమ్మేము . ............ఇలా కొంత కాలం జరిగింది ........చివరకు అన్నింటిని పరిత్యజించి స్వామి సన్నిధికి చేరుకున్నాం.


నరసరావుపేట శంకరమట్ లో స్వామివారు ఉండేవారు. అక్కడ ఏ వసతులు లేవు .  ఎండ, చలి, వాన, అక్కడి వాతావరణానికి మా శరీరాలు ఎడ్జస్ట్ కాలేదు. మట్టిమీదే అన్నం తినడం. తరువాత స్థలాన్ని శుభ్రపరచి అక్కడే గుడ్డ పరచి పడుకునే వాళ్ళం. మేము వొచ్చిన కొత్తలో భక్త శ్రీ జగార్లపుడి  మారుతీ వరప్రసాద్ గారు బజార్నుంచి సరకులు తేవడం. ఇలా ఏది అవసరమైతే అది తెచ్చేవారు. 

తరువాయి భాగం 5 లో ........

No comments:

Post a Comment