Sunday 11 December 2011

Na Jnapakalu

నా జ్ఞాపకాలు

   మాతశ్రీ 
చాల మంది భక్తులు శ్రీ స్వామివారి జీవితములో జరిగిన సంఘటనలు తెలుసుకోవాలని వున్నది,  వాటి గురుంచి "శ్రీ విశ్వగురు ప్రభ " పత్రికలో వేస్తె బాగుంటుంది అని అడిగారు.    
శ్రీ స్వామివారు సన్యసించిన తరువాత సరిగా 12 సం: విస్తృతముగా పర్యటించారు. ఆ సేతు హిమాచల పర్యంతం సంచారం చేసారు. ఆంధ్ర రాష్ట్రంలో చాల ప్రదేశాలలో వారు మధురాతిమదురంగా ఉపన్యాసాలు ఇచ్చారు. 1962 లో సన్యసించిన స్వామి 1974 వరకు పర్యటించారు. శ్రీ స్వామి వారి పరిచయం మాకు 1965 లో ఐయ్నది. కనుక 1965 నుండి  74 లోపు జరిగిన వారి జీవిత సంఘటనలలో నాకు జ్ఞాపకం ఉన్న వాటిలో కొద్ది సంఘటనలు ప్రస్తుతం పాఠకులకు అందిస్తున్నాను.
శ్రీ విద్యారణ్య భగవానుల వారు ఆ రోజులలో శ్రీ విద్యారణ్య స్వామివారిగా అందరికి తెలుసు. స్వామిజి అతిచిన్న వయస్సులోనే సన్యాసం తీసుకున్నారని ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇస్తారని ఇలా ఇలా ఆనోటా ఆనోటా తెలుసుకొని, వారు వారు పెట్టుకున్న కార్యక్రమాలకు శ్రీ స్వామివారిని ఆహ్వానిఇంచే వారు.  సభకు అద్యక్ష స్థానంలో శ్రీ స్వామివారిని ఉంచి, ఉపన్యాసకులుగా, కవులుగా, పండితులుగా మంచి పేరును సంపాదించుకున్న వారిని ఏర్పాటు చేసుకున్డే వారు కొంతమంది. శ్రీ స్వామి వారి ఉపన్యాసం వింటున్న కవులకు, పండితులకు వారికీ గూడా తెలియని ఎన్నో వేదాంత రహస్యాలు శ్రీ స్వామివారు చెప్తుంటే  అస్చ్యర పోయేవారు. నవ్వుతు తన్మయంగా వినేవారు.  ఇలా జరుగుతున్నరోజులలో గుంటూరు బ్రోదిపేటలో ఉన్న ఓంకార క్షీత్రం లో సభ్యులు శ్రీ స్వామివారిని తమ సప్తాహ ఉత్శావలకు ఆహ్వానించే వారు. భగవద్గీత, వివేకచూడామణి, పంచదసి లాంటి వేదాంత గ్రంథాలఫై అద్భుతంగా ఉపన్యసించే వారు. ఒక్క ఉప్న్యసవేలలోనే కాక విడిగా కూడా వారున్న గదికి దర్శనార్ధం ఎందరో వచ్చే వారు.  ఇలా క్షీత్రానికి స్వామి వచ్చినప్పుడల్లా ఎంతో ఇష్టంగా వారిని దర్శిన్చుకోడానికి  చిన్న, పెద్ద, స్త్రీ పురుషులు అందరు వచ్చే వారు,. 
అందరిలా మేము కూడా వారి దర్శనానికి వెళ్ళాము. ఏమిటో వారిని దర్శించిన మొదటిసారి "ఎక్కడో హిమాలయాలలో తపస్సు చేసుకొనే వారిలాగా అనిపించారు. వారి మాట తీరు కూడా వేరుగా అనిపించింది. వారి రెండు కళ్ళకు మధ్య అంటే భ్రూ మద్యమంలో గొప్ప తేజస్సు కనపడింది. స్వామిలో ఏదో విశేషం ఉందనిపించింది. క్షేత్రానికి వారు వస్తే తప్పనిసరిగా దర్శించుకొనే వారం. మా లాగే ఇతర భక్తులు వచ్చే వారు. కాలం ఇలా జరుగుతున్నది. దర్శనానికి వచ్చిన ఇతర భక్తులకు భోదలు చేస్తుంటే వినే వాళ్ళం. సాయంత్రంపూట గుడి వారి programme ప్రకారం ఏర్పాటు చేసిన సభలలో అందరికి చెప్తున్నప్పుడు వినే వాళ్ళం. points note చేసుకోవాళ్ళం.
స్వామివారి దర్శనానికి ఏ కట్టడి లేదు. సమయ నిర్దేశం కూడా లేదు. ఇతర ఊళ్ళ నుంచి అర్ధరాత్రి వచ్చినా  భక్తులకు దర్శనం ఇచ్చేవారు. చిన్న వారి దగ్గరనుండి పెద్దవారి వరకు అందరికి స్వేస్చే. (freedom ).  స్వామివారు చేసే భోధలు వింటె చాలు. అందరి మనస్సులు చాల వరకు ఆధ్యాత్మిక ప్రేరణ పొందేవి. విన్టున్నంతసేపు ఎక్కడో హృదయాంతరాలలో దాగి ఉన్న వేదాంత సంస్కారాలు బహిర్గతం అయ్యేవి. 
ఒక  సారి ఒక 9 సం : పిల్లవాడు స్వామి దర్శనానికి వచ్చేడు. అప్పుడు మేము, ఇతర భక్తులుకుడా వున్నాం. స్వామివారు భోధన చేస్తున్నారు. అందరు శ్రద్ధగా వింటున్నారు:::  ::: ఇంతలో పిల్లవాడు లేచి ఏమండీ స్వామి ! దేవునికోసం జీవించటమే గొప్ప నేనుకూడా మీలాగే వుంది పోతానండి అన్నాడు దయి ర్యంగా.  స్వామివారు  "ఏమిట్రా! నీవు నావలె వుంటావా!  మీ అమ్మ నాన్న భాధ పడతారు".  ఏంటి స్వామి "అమ్మ లేదు నాన్న లేదు" అన్నాడు. "మరి వాళ్ళు లేకపోతె నీవు ఎక్కడ నుండి వచ్చావురా? " అన్నారు స్వామి వారు. "ఏమిటి స్వామిజి భగవంతుడు అనుకుంటే వీల్లెవారు లేకున్నా పుడతనండి!" అన్నాడు. స్వామివారు నిజంగానే అస్చేర్య పోయారు. "ఓరి పిడుగా!!!!!" అన్నారు. గదిలో ఉన్నవారంత గట్టిగా నవ్వేరు.      ఆ  పిల్లవాడు నిజంగా అలా తెలిసి మాట్లాడ గలిగాడ,  కాదు అది స్వామి సన్నిధి ప్రభావం. వాడి ఎప్పటి సంస్కరాలో అలా మాట్లాడించి నై .  
చూసారా ఇఎస్కంత (మాగ్నెట్) సిల ఒక చోట ఉన్నది అంటే దాని ఆకర్షణ ప్రభావం కొంత వరకు వ్యాపించి ఉంటుంది. ఇనుపముక్కను ఆ ప్రదేశంలో ఎక్కడ ఉంచినా ఐస్కాంత సిలకు అది అతుక్కుంటుంది .  ఆకర్షించుకొనుట ఐస్కాంత లక్షణమే గాని ఇనుపముక్కడి కాదు.  స్వామి సన్నిధి, వారి జ్ఞాన విరాగ మహిమ ఆ పిల్ల వాడిని అల్లా మాట్లాడించింది.
స్వామి క్షీత్రానికి (ఆ టెంపుల్ కి ) వచ్చారని తెలిస్తే  చాలు భక్తులు సంతోషంతో దర్శనానికి వచ్చే వారు. చాల వృద్దులు గూడా వచ్చే వారు. కస్టపడి మెడ మెట్లు ఎక్కుతూ (మోకాళ్ళ నెప్పులు భరిస్తూ) ఆయాసపడుతూ వారి దగ్గరికి వచ్చే వారు. స్వామి! నమస్కారాలు అంటూ కింద చతికిలపడి కూర్చునేవారు. స్వామి వారికీ చాల భాద కలిగేది. "ఎందుకండీ మీకింత కష్టం? క్రింద వుండే నమస్కారాలు చేసుకోవచ్చు కదా !" అనే వారు.  "అయ్యా! స్వామీ, అల్లా అనకండి మీరు వచ్చారని తెలిసి కూడా దర్శించుకోకపోతే ఇంతకూ వేఎంతల భాద కలుగుతుంది" అనే వారు. "వెధవ శరీరం ఏముంది ?  మా బోంట్లకు మీ దర్శనమే అదృష్టం " అనే వారు. మీ దర్శనం, మీ చల్లటి పలకరింపులు, మీ నవ్వు, మాకు వుంటే చాలు, ఎంత అలసట ఐన మాయం ఐ పోతుంది. అల్లా అంటూనే ప్రతి రోజు దర్శనానికి వస్తువుండే  వారు.  అదే విధంగా చదువుకునే చిన్న విద్యార్ధులు వచ్చేవారు. తమ ఎదట వున్నది ఎంత  గొప్ప స్వామి! ఏమో తెలియదు !
విద్యార్ధులను చూస్తీ స్వామివారికి ఎంత హాయో ! "ఏరా వచ్చారా ?" అనే వారు. very good  అనేవారు. ఒరేయ్ ! మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తార! అనే వారు. మీలో ఎవరు చక్కగా చెప్తే  వారికీ ప్రజన్ టెషేన్! మరి అడగనా? అనేవారు. పిల్లలు ఉత్సాహంతో అడగండి స్వామి, నేను చెప్తాను,నేను చెప్తాను అంటూ బాగా సందడి చేసేవారు.  స్వామి తానుగూడ ఒక పిల్లవాడిలాగా అందరితో కలిసి పోయేవారు. ఆ ! రెడీ ! ప్రశ్న వేస్తున్నాను ! అంటూ పిల్లలకు తగ్గ ప్రశ్నలు వేసే వారు. పిల్లలు చక్కగా సమాధానం ఇచ్చేవారు. స్వామీజీ ఎన్తోసంతోషంగా నవ్వి శెభాష్ ! అని మెచ్చుకొనేవారు. తన దగ్గర వున్నపండ్లు తీసి అరేయ్ పండు మీ విఇపు వేస్తున్నాను అనేవారు. క్రిందపడకుండా క్యాచ్ చెయ్యాలి అంటూ వారికీ వేసేవారు, (సమాధానం చెప్పినవారికి చెప్పనివారికి గూడా).  కొంతసేపు మంచి మంచి శ్లోకాలు నేర్పేవారు , కొంతసేపు మహాత్ముల ఆదర్శ జీవితాలు చెప్పేవారు. ఇలా చిఇనపిల్లలు కూడా స్వామివారంటే ఏంటో ఇష్టంగా ఉండే వారు . 
ఒక్కోసారి పండితులు వచ్చే వారు .  వారు సంస్కృతంలో మాట్లాడితే స్వామివారు కూడా సంస్కృతంలో మాట్లాడేవారు.పండితులు వారి సందేహాలను సంస్కృతంలో అడిగేవారు. స్వామివారు సంస్కృతంలోనే చెప్పేవారు. ఆ పండితులు స్వామివారి వైపు విస్తుపోఇ చూసేవారు. ఇంత చిన్న వయస్సులో స్వామివారికి ఇంత శాస్త్ర జ్ఞానమా? స్వామి మాకు గూడా తోచని విషయాలు మీరెలా చెప్పగల్గుతున్నారు? అనేవారు.
ఒక్కోసారి స్వామి కుర్చీలో కాళ్ళు ముడుచుకుని కూర్చునేవారు. కొందరు భక్తులు స్వామి ఇలా కాల్లుముడుచుకొనే కూర్చుంటే ఎలా ? మేము ఎలా తరిస్తాం? మేము తరించాలంటీ మా శిరస్సులు మీ పాదాలను స్ప్రుసించాలి అంటూ స్వతంత్రంగా వారి కాళ్ళను దింపి వారి వారి శిరస్సులను స్వామి పాదాలపై ఉంచేవారు. ఇలా చేయటం స్వామికి కోపం తెప్పిస్తుందని భయపడే వాళ్ళం  కాని ఎంతో ఆహ్లాదకరంగా నవ్వి ఎలా ఉన్నారు అంటూ అందరిని పేరు పేరునా పలకరించేవారు.   
మిగతాది తరువాయి భాగంలో .....................2 లో  ........



 


No comments:

Post a Comment