Saturday 17 December 2011

Naa Jnapakalu 5

నా జ్ఞాపకాలు 5
మా గురించి  సమాజంలో రక రకాల వ్యాఖ్యానాలు. అన్ని తట్టు కున్నాం. భాగావాంజి అనుగ్రహమే మాకు సర్వాలంబనం. అశ్రామానికి వచ్చాక జీవితం క్రమభద్దమైంది. కాలం జరుగుతున్నది, ప్రతి రోజు శ్రీ స్వామివారు వేదాంత గ్రంధాలపై భోధనలు చేసేవారు. శంకర మటంలో ఏ సౌకర్యం లేక పాయినా మేము భాధ పడలేదు. ఒకరోజు శ్రీ నెప్పల్లి కుటుంబరాయ శర్మ గారు సతీ సమేతంగా భగవానుల వారి దర్శనానికి ఒచ్చారు. కారులో శర్మగారు (ఆశ్రమం తీసుకుని మటంలో నివసిస్తున్నవారి ) పూర్వాశ్రమ సతీమని శ్రీమతి విజయలక్ష్మి గారు మేము ఉంటున్న క్వార్టర్స్కుకు వొచ్చారు. మాకు ఏ సౌకర్యం లేదని మనసులో అనుకొని వెంటనే నీరు స్టాక్ చేసుకోవడానికి బిందెలు, వంటకు అవసరమైన వన్నీకొని ఇచ్చారు. ఎప్పుడు వుత్చాహంగా వుంటారు. ఆమె పిల్లలకు స్వామీజీ అంటే చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు.  ఆ వయిసులోకూడా ఇదేమిటి ? అదేమిటి ? అంటూ స్వామివారిని గొప్ప గొప్ప విషయాలు అడిగేవారు. స్వామి వాళ్ళ ప్రశ్నలకు సంతోషంగా జవాబులు ఇచ్చేవారు. వాళ్ళు ఇప్పటికి స్వామితో తమకు వున్నా అట్టాచ్మెంట్ చెప్తుంటారు.
    శ్రావణమాసంలో మాకు పరిత్యాగ జీవితం మొదలైతే కార్తీకమాసంలో భగవానుల వారి పుట్టినరోజు.  ఈ సందర్భంగా N K  శర్మ గారు శ్రీ స్వామి వారి అనుమతి కోసం ఒక ఇంజనీరు గారిని శంకర మటంకు పంపారు. అప్పుడు మటంలో పరమగురువు గారు కూడా (భాగావాంజికి సన్యాస దీక్ష ఇచ్చిన వారు ) వున్నారు. సరే funaction కి అందర్నీ రమ్మని ఆహ్వానించారు. జన్మదినోత్సవం చాలాబాగా చేసేరు. విజయలక్ష్మి గారి హడావుడి యింతా అంతా కాదు. అందర్నీ రధంపై ఊరేగించారు, బ్రహ్మ రధం  పట్టేరు.  ఊరి వీధులలో రధంపై ఉరేగుతుంటే  ఆ ఊరి జనం చెట్లపైన డాబాలపైన ఉండి photos తీసారు.  కొద్దికాలానికి గుంటూరు ఓంకార క్షేత్రం వారు స్వామిని క్షే త్రంలో  జరిగే ఉత్సవాలకు రమ్మని ఆహ్వానించారు. అంగీకరించారు శ్రీ స్వామి. పెద్ద మాతాజీని కూడా ఉపన్యాసమివ్వమన్నారు.  మాతాజీ పూర్వాశ్రమం పేరు రుక్మిణి దేవి.  ఆమె M .A ., B .E d ., చేసారు.  గుంటూరులో ప్రసిద్ధిచెందిన హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా పనిచేసారు.  దీక్షా నామం సద్విద్య  ప్రభా దేవి .  ఈ  పేరుతోనే అన్ని వ్యవహారాలు, గుడివాళ్ళు కరపత్రాలను అచ్చు వేయించారు. శ్రీ విశ్వ గురు  విద్యారణ్య స్వామివారి పరివ్రాజికా శిష్యురాలు మాత సద్విద్యా  ప్రభాదేవి గారి ఉపన్యాసం సాయంత్రం 7 గం: అని అచ్చువేసారు.  ఉపన్యాసాలు మొదలయినాయ్.  మాతాజిగారి వంతు వొచ్చింది.  కాషాయి రంగు వస్త్రధారణతో శ్రీ మాతాజీ ఎన్నో వేదాంత విషయాలు వుట్టంకిన్చుతూ గంభీరంగా ఉపన్యాసం ఇచ్చారు. అందరు  ఆమె ఉపన్యాసం విని ఆశ్చర్య పోయారు .
హటాత్గా ఒక పండితుడు (ఎన్నో గ్రంధాలు రాసిన కవి, పండితుడు) stage ఎక్కి ఆసనంపై ఆసీనులై ఉన్న శ్రీ విద్యారణ్య గురుదేవులతో "స్వామీ నేను ఓడి పోయాను ! మీ శిష్యురాలు అమోఘంగా ఉపన్యసించారు. ఏమి గంభీరమైన స్వరం. సంస్కృత శ్లోకాలను అలవోకగా అందంగా చదివారు. కర పత్రాన్ని చూసాను ఒక స్త్రీ వేదాంత విషయాలను ఏంచెపుతుంది అనుకొని నవ్వుకొన్నాను. ఒకప్పుడు వారిని విమర్శించిన వారిలో నేనూ ఒకడినే. నా గర్వం అంతా ఈ రోజుతో పటాపంచలైపాయింది "  అంటూ మాతాజికి తాను వ్రాసిన పుస్తకాలను అందరి ముందు pregent చేసారు. మాతాజీ తోపాటు  పూర్వం హైస్కూల్లో పనిచేసిన టీచర్లు, విద్యనేర్చుకున్న విద్యార్ధినులు, అందారు వచ్చారు సభకు.  మాతాజిని stage మీద చూసి  ఎవరు ?  రుక్మిణి కదూ అని ఒకల్లవైపు ఒకళ్ళు చూసుకొన్నారు. మాతాజీ స్టేజి దిగగానే టేచర్లు, స్తుడేంట్లు, అందరు ఆమెను చుట్టూ ముట్టారు. మాతా సద్విద్యా ప్రభా దేవి అంటే ఎవరో అనుకొన్నాం నీవేనా ! అంటూ ఎంతో సంతోషంగా మాట్లాడరు. ఆశ్రమానికి వొచ్చాక మాతాజీ గారు ఇచ్చిన మొదటి ఉపన్యాసంగూడ ఇదే. 
1970 లో హైదరాబాద్ లో పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విఘ్రహ ప్రతిష్ట....... లక్ష్మి నరసింహస్వామివారి ఉపాసకురాలైన ఒకామె ప్రార్ధనపై శ్రీ స్వామివారు చేసారు. ఆలానే విజయవాడ లో సత్యనారాయణ పురంలో...శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయానికి కుంభాభిషేకం, స్వామివారి చేతులమీదుగా జరిగింది. వేద మంత్రాల ఘోషతో బ్యాండ్ మేళాలతో అత్యద్భుతంగా అలంకరింపబడిన పందిట్లోకి శ్రీ స్వామిని అడుగడుగునా వారి పాదాలపై పుష్పాలు జల్లుతూ ఎంతో దివ్యంగా ఆహ్వానించారు అచటి భక్తులు. ఆ ఉత్సవానికి Dr చలపతి రావు గారు కాంగ్రెస్ పార్టీ MLA కూడా వోహ్హరు. పెద్ద గజమాల స్వామీ మేడలో వేసి స్వామీ మీరు సామాన్యులు కారు. మీలో దివ్య తేజస్సును చూసాను, తమరు ఒక్క నెలరోజులపాటు ఉపన్యాసాలివ్వండి చాలు.  ఆ తరువాత కని విని ఎరుగని ఒక పెద్ద ఆశ్రమం కట్టించి మీకు సమర్పిస్తాం. అన్నారు.  ఇలా ఆయన తో పాటు ఆ ఊరి పెద్దలు కూడా కలసి ఒప్పుకొంది స్వామీ అంటూ వేడుకొన్నారు. కాని స్వామివారు ఎందుకో ఒప్పుకోలేదు. "మంగోల్లు" అను మరొక ఊరిలో శ్రీ అది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసారు. ఏ దేవుని విగ్రహ ప్రతిష్ట అయీన శ్రీ స్వామీ వారు ఎంతో నియమ నిష్టలతో ఒచ్చి మంచినీరు కూడా త్రాగేవారు కాదు. 
ఇలా వారు సంచరించిన కాలంలో ఎన్నో చోట్ల ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్సవాలకు విద్యారణ్య స్వామీ వస్తున్నారా అని ఆ యా  ఊరి కమిటి మెంబర్లను చాలా ముందుగానే అడిగేవారు. తెలియదండి బహుసా రారనుకొంటు న్నాం అనగానే  జనం  లేదు  వారు రావాలి అల్లాగైతేనే మీకు చందాలు ఇస్తాం లేకుంటే లేదు. మీరు మల్లి అడగండి అని మెంబర్ల పై ఒత్తిడి తెచ్చేవారు. స్వామివారిని రమ్మని ఆహ్వానిస్తూ ఎంతో మంది ఉత్తరాలపై ఉత్తరాలు వ్రాసేవారు. దూరప్రాంతాలవారు కారేసుకుని వొచ్చేవారు. రమ్మని ప్రాధేయ పడేవారు.  స్వామివారికి చాలా ఇబ్బందిగా ఉండేది.  చివరకు నాయనా !  ఏమీ అనుకోకండి నాకు  ఎటు రావాలనిపించటంలేదు . ఎందుకని అడిగితే నేను ఏమి చెప్పలేను. ఎప్పుడైనా మళ్లీ రావాలనిపిస్తే మీకు తప్పకుండ తెలియచేస్తాను. నేను రాక పోయానా మీ ఉత్సవాలకు నా ఆశిస్సులు ఎప్పుడూ ఉంటై అని ఓదార్చి పంపే వారు. ఇలా వారి సంచారాలు నిలిచిపోయాయి . 
1971 లో స్తలం కొని నూతన ఆశ్రమానికి శంకుస్థాపన చేసారు ...
మిగతా చరిత్ర ముందు ముందు .....
శ్రీ విశ్వగురు ప్రభ  vol 38 No 1 , నవంబర్ 2011 ఆధారంగా , మాతాజీ గారి దీవెనతో


 


Thursday 15 December 2011

Na Jnapakalu 4

" వదామిభగవానహం " స్వామిరూపంలో అనుగ్రహిస్తున్న భగవంతుడనని తెలియదు. తెలిస్తే ఈ ప్రశ్న వేసేవారు కారు. వెంటనే ఆ ఆఫీసర్ అవును స్వామి ఆ తేజస్సు మీలో ఉన్నది.  మీ ఆకర్షణే వేరు.  నేను మీ దర్శనానికి సరిగా 9 గం: వొచ్చాను. ఇప్పుడు 1 గం: ఐంది, ఇంత సేపు ఏ స్వామి దగ్గర ఉండలేదు. మీరు మాట్లాడుతుంటే ఏదో ఆహ్లాదం !వేదాంత రహస్యాలను ఎంత సులభంగా అర్ధమయేట్లు  చెప్పారు.  నేను వచ్చి చాల సేపు అయినా ఇప్పుడే వచ్చినట్లు అనిపిస్తోంది. అజ్ఞానంతో మిమ్ములను పిచ్చిగా ప్రశ్నించాను క్షమించండి అన్నారు.
ఇలా వ్రాసుకుంటూ పోతే ఎన్ని సంఘటనలో....స్వామివారు ఎప్పుడో క్షేత్రానికి వస్తారు. వచ్చినప్పుడల్లా మిస్ కాకుండా దర్శనానికి వెళ్ళేవాళ్ళం . ఇంకా చెప్పాలంటే ఇంట్లో అందరు చిన్న పెద్ద ఇంకా కజిన్స్ అందరు ఏదో మంత్రంవేసినట్లే దర్శనానికి వచ్చే వాళ్ళు. ఎవెరి టైం వారిది. ఎవరు ఎప్పుడు వచ్చినా అందరికి వారి వారికీ తగ్గ భోధలు చేసేవారు. అలానే ఇతర భక్తులకు. సామివారు అందరికి చెప్పే బోధలు మేముకూడా వినేవాళ్ళం. ఒక సబ్జెక్టుగా మాకు ప్రత్యేకించి చెప్పలేదు. ఎప్పుడు ఏదో వ్రాసుకుంటూ భాష్యాలు,గ్రంధాలు చదువుకోవటం చేస్తూ ఉండేవారు. వారు జింక చర్మం వేసుకొని నేలమీద పడుకొనేవారు. చెక్క కమండలం. కొబ్బరి చిప్పతో మంచినీళ్ళు త్రాగటం చేసేవారు.
ఒక రోజు ఉదయం దర్శనానికి వెళ్ళాం. స్వామివారు నేలపై పడుకుని ఉన్నారు. మాకు భయం వేసింది.  ఏమిటండి! ఇలా పదుకునిఉన్నరు? అన్నాం. శరీరం జ్వరగతం ఐంది అమ్మ అన్నారు. మాకు అర్ధం కాలేదు . మాములుగా జ్వరం వస్తే "జ్వరం వొచ్చింది అంటాం" . శరీరం జ్వర గతం అంటున్నారెంటి, విచిత్రంగా ఉందనిపించింది.ఓహో ! జ్వరం వొచ్చింది శరీరానికి, నేను శరీరాన్ని కాదు గదా! ......నేను" అంటే ఆత్మ, ఆత్మకు ఏ వికారము లేదు అని తెలియచెప్పటానికి అల్లా మాట్లాడారని అనిపించింది. తరువాత ఆలోచిస్తే జ్వరం పోవడానికి మందులు తెస్తామన్నాము. వోద్దమ్మ! శరీరం ఇలా ఎంతకాలం అనుభవించవలెనో అంతకాలం అనుభవించని అన్నారు. ఇదేమేటి ఇలా మాట్లుడుతున్నారు అనుకున్నాం. ఇంత జ్వరంలో కూడా చన్నీళ్ళు స్నానం, అనుష్టానం చేసేవారు. చన్నీళ్ళస్నానం జ్వరాన్ని ఇంకా పెంచుతుంది. గుడివాళ్ళు వేడి నీళ్లు ఇవ్వొచ్చుగా! ఏమిటో ఈమనుషులు!.  సరే పొని మనమే ఇంటిదగ్గర నీరుకాచి తెద్దాం అని వేడి నీరు కాచి బుజానపెట్టుకుని గుడివరకు నడచుకుంటూ తిసుకేల్లాం. పడుక్కోవడానికి చాపకుడ తిసుకేల్లాం. కాని స్వామివారు ఏది ఒప్పుకోలేదు. వోద్దమ్మ నేను చన్నీల్లె చేస్తాను, చాపపై పడుక్కోను, జింక చర్మమే నాకు చాప. అని తిరస్కరించారు సున్నితంగా.  ఇలా
 ఒకటిన్నర సంవత్సరం పూర్తికాలేదు, స్వామివారి భోధనల ప్రభావం మా మనస్సుల పై  పని చేసినదేమో భగవంతుడి కైంకర్యానికి మా జీవితాలను అంకితం చేయాలనీ అనుకున్నాం,. స్వామిజీకి మా ఆశయాలను చెప్పాం. వారు చాల ఆశ్చర్యపోయారు ! అమ్మా త్యాగమయ జీవితంలో చాల కష్టాలు ఉంటై. మీ ఇంటిలోవారంతా భాధపడతారు , మీరు బాగా చదువుకుంటున్నారు, ఇంటి దగ్గరే ఉంది కూడా సాధన చేయ్యవొచ్చు. నాకు సొంత ఆశ్రమం లేదు. డబ్బు కూడా నేను ఎవ్వరిని అడుగను. మగవారు సన్యసిస్తే చెట్టు క్రిందనైనా ఉండగల్గుతారు.స్త్రీలకు అలా కాదు ఎన్నో అవసరాలు ఉంటాయి . అవన్నీ మీకు ఎవరు చూస్తారు? ఇలా ప్రోత్సహించలేదు.

స్వామీ అన్నిటికి మీ పాదాలను ఆశ్రఇంచామ. భగవద్భారతిలో మీరు చెప్పిన ఉపదేశాలు గట్టిగా నమ్మేము . ............ఇలా కొంత కాలం జరిగింది ........చివరకు అన్నింటిని పరిత్యజించి స్వామి సన్నిధికి చేరుకున్నాం.


నరసరావుపేట శంకరమట్ లో స్వామివారు ఉండేవారు. అక్కడ ఏ వసతులు లేవు .  ఎండ, చలి, వాన, అక్కడి వాతావరణానికి మా శరీరాలు ఎడ్జస్ట్ కాలేదు. మట్టిమీదే అన్నం తినడం. తరువాత స్థలాన్ని శుభ్రపరచి అక్కడే గుడ్డ పరచి పడుకునే వాళ్ళం. మేము వొచ్చిన కొత్తలో భక్త శ్రీ జగార్లపుడి  మారుతీ వరప్రసాద్ గారు బజార్నుంచి సరకులు తేవడం. ఇలా ఏది అవసరమైతే అది తెచ్చేవారు. 

తరువాయి భాగం 5 లో ........

Monday 12 December 2011

Na Jnapakalu 3

ఓం నమో భగవతే విద్యారణ్య నమః  నా జ్ఞాపకాలు  3  
భిక్ష చేసేముందు స్వామి మళ్లీ స్నానం చేసి అనుష్టానం చేసుకుంటారు. ఈ సంగతి తెలుసుకుని వారికీ మడిగా వస్త్రాలు ఆరవేసారు. మడిగా గంగాళం నీరు నింపారు. స్వామీ! స్నానం చేస్తారా? అన్నారు. అంతా మడిగా ఉంచామన్నారు. ఎందుకమ్మా మీకింత శ్రమ, బావి ఉన్నదిగా హాయిగా తోడుకొని పోసుకున్దేవాడ్ని అన్నారు. స్వామీ మీరు అలా అనకండి ఈ రోజు మాది. మేము చెప్పినట్టే మీరు ఒప్పుకోవాలి, మీ సేవతో మా జన్మలు ధన్యంకావాలి. మీరు ఇక్కడే స్నానం చేయండి. మా ఇంట్లో వారంతా మీకు అభిషేకం చేయాలనీ ఆస పడుతున్నారు స్వామీ! అనుమతినచండి అంటూ ఎంతో సంతోషంతో చెంబులతో నీరు తీసుకుని "ఓం నమశ్శివాయ " "ఓం నమో భగవతే విద్యరన్యాయ " అంటూ ఆనందంతో అభిషేకం చేసారు. స్వామీ అనుష్టానంతరం బిక్ష పెట్టి "స్వామీ తమ కృపతో ధన్యులమయ్యాం. తప్పులుంటే క్షమించండి అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
     ఒకసారి ఒక పెద్ద ఆఫీసర్ గారు స్వామివారి దర్శనానికి వొచ్చారు, నమస్కరించి "స్వామీ! వేదాంతంలో నాకు కొన్ని సంసయాలుఉన్నాయ్ తమద్వార తప్పక తీరగలవని ఆశతో ఒచ్చాను.  సరే!అడగండి అన్నారు స్వామీ. అయన ఎన్నో ప్రశ్నలు వేసారు. స్వామీ అన్నిటికి నవ్వుతు జవాబులు ఇచ్చారు. ఆ ఆఫీసర్కు స్వామివారు చెప్పే భోధలపై మనస్సులేదు. స్వామివారి కదలికలు, చూపే ఆనందం, నిర్మలమైన నవ్వు వీటిని గమనిస్తున్నారు. కొంచెంసేపు ఆలాగే స్వామీవారి వైపు నిస్చేస్స్తుడై చూసాడు సందేహాలు అడగటం లేదు. ఏమండి ! మీ సందేహాలు తీరినవా అని స్వామి అడిగారు. లేదు స్వామి అన్నింటికంటే బలమైన సంశయం నాకిప్పుడు కలిగిందన్నాడు. ఏమి టండోయీ! మరి అడగండి అన్నారు స్వామీజీ.   ".....స్వామి మీరు ఎప్పుడు నవ్వుతుంటారు.  మామూలుగా స్వామీజీలు  గంభీరంగా ఉంటారు గదా! ఏమి చెప్పమన్నా సీరియస్ గా  చెప్తారు.  కాని .......మీరు.....అన్నాడు. ఓహ్! అదా మీ సంశయం నాయనా ! నీవు నన్ను కేవలం ఒక స్వామిగానే అర్ధం చేసుకున్నావు. "కాని నేను అవతరించిన భగవంతుడిని " అని చెప్తున్నాను  "వదామిభాగావాన్ అహం" ....స్వామీ రూపంలో అనుగ్రహిస్తున్న భగవంతుడిని అని తెలియదు. తెలిస్తే ఈ ప్రశ్న వేసేవారు కాదు తెలిసిందా ! అన్నారు స్వామి. అవును స్వామి ఆ తేజస్సు మీలో వున్నది.  మీ ఆకర్షణే వేరు.  నేను మీ దర్శనానికి సరిగ్గా 9 గం: వొచ్చాను --- ఇప్పుడు 1 గం. ఇంతసేపు ఏ స్వామి దగ్గర లేను మీరు మాట్లాడుతుంటే ఏమిటో ఆహ్లాదం, వేదాంత రహస్యాలను కూడా ఎంత సులభంగా అర్ధమయ్యేలా చెప్పారు. నేను వొచ్చి చాలా సేపు ఐయెన ఇప్పుడే వొచ్చినట్లు అనిపిస్తున్నది అన్నారు. అజ్ఞానంతో మిమ్ములను ఎంతో పిచ్చిగా ప్రశ్నించాను స్వామి క్షమించండి అని వెళ్ళిపోయారు.
మిగిలినది తరువాయి పోస్ట్ 4 లో

Na Jnapakalu 2

ఓం నమో భగవతే విద్యారణ్య స్వామియే నమః     నా జ్ఞాపకాలు 2 
ఒక సారి గుంటూరులో ప్రసిద్ధిచెందిన ఒక లేడి డాక్టర్ గారు స్వామి దర్శనానికి వొచ్చారు. స్వామికి నమస్కరించి కూర్చున్నది. తనను గురుంచి పరిచయం చేసుకున్నది. తను దియోసాఫికాల్ సొసైటీ కి పెద్ద లీడర్ నన్నది. స్వామివారు అలానా! అని అన్నారు.  తరువాత ఆయన సమాజం ఏ వైపూకు నడిస్తే మంచిది , ప్రపంచంలో ఏర్పడిన రక రకాల సమాజాలు వాటి సిద్ధాంతాలు, వైదిక మత ప్రాసస్యం, ఇలా ఎన్నో విషయాలు చాలాసేపు చెప్పారు. ఆమె వెళ్లేముందు "భగవత్ భారతి " గ్రంధాన్ని ప్రసాదంగా ఇచ్చారు. ఆమె ఇంటికి వెళ్లి ఆ రోజే మొత్తం చదివినట్లుఉన్నది. మర్నాడే మళ్లీ వచ్చింది. స్వామి మీరిచ్చిన గ్రంధం చదివాను. మరీ అన్యాయంగా రాసారు. చాలా వరకు స్త్రీ దూషనే కనిపించింది. నాకు నచ్చలేదు స్వామి అన్నది. స్వామివారు ఎంతమాత్రమూ భాధ పడలేదు. అమ్మ! ఫై ఫై న  చదివేవారికి భగవద్భారతి మీకు లాగునే అర్ధం ఆవుతుంది.  ఇక్కడ స్త్రీ అన్న మాటకు అర్ధం వేరు. శారీరకంగా, మానసికంగా స్త్రీలు శ్రుష్టి లోనే బలహీనులు. మమకారాలు భాన్ధంవ్యాలు వీటిలోనే చాలావరకు స్త్రీలు ఆనందంగా ఉంటారు. పురుషుడైన సరే స్త్రీల మనస్సు కలిగిఉంటే వారూ స్త్రీ సమానులే. మోక్షమన్నది పురుషార్ధలలో పరమమన్నవి శాస్త్రాలు. మోక్షమంటే ఆత్మను పరమాత్మలో లీనం చేయటం. ఇందుకు ద్రుఢమైన సాధన కావాలి. మనస్సు ద్వందాతీతం కావలి. బలహీన మనస్సులకు పరమాత్మ అందదు.  మోక్షం కావలి అన్న కోరిక కలుగుటే చాల కష్టం. స్త్రీలైనా మొక్షీస్చ కలుగుతే తన్మార్గంలో నిశ్చలంగా ఉండగలిగితే ధన్యులే.  గార్గి, మైత్రేయి వంటి స్త్రీలు గొప్ప జ్ఞానులు. కాని వారిలాగా ఎంతమంది స్త్రీలున్నారు. ప్రకృతిలో స్త్రీలకున్న ఆకర్షణ చాల గొప్పది . ప్రక్రుతి మొహం  మనిషిని బలహీన పరుస్తుంది.  కనుక మోక్ష గ్రంధాలు  స్త్రీ ఆకర్షణ ముముక్షువులకు ఎంత ప్రమాదకరమో రక రకాలుగా తెలియపరస్తుంటై . భగవద్భారాతిని మీరు ఈ దృష్టితో చదవండి అని అన్నారు. ఆమె గూడా ఎంతో సంతోషపడింది .  స్వామి మీరు అనుకున్నంత తేలికగా అందరు.  మీది చాల గంభీర తత్వం .  నేను చేసిన కామెంట్ కు మీకు చాల కోపం వస్తుందనుకొన్నాను .  కాని మీకు కోపం రాలేదు. నాకు వివేకాన్నిచ్చారు. సమాజంలో నాకు ఎంత పేరున్న మీ ముందు నేను సున్నా. తొందరపడి మాట్లాడను, క్షమించండి అంది.
      ఒక సరి ఒక డాక్టర్అమ్మగారు స్వామిని దర్శించింది. శ్రీ స్వామిలో ఆమెకు ముగ్ధ మనోహర శ్రీకృష్ణ భగవానుడు  కనిపించాడట. ఆమె హృదయంలో కృష్ణ స్వరూపముగా ప్రతిస్తించు కున్నది.  ఒక రోజు వాళ్ళ ఇంటికి బిక్షకు రమ్మని ఆహ్వానించింది. వాళ్ళ ఇంటికి  స్వామిని తెమ్మని కారు పంపింది. ఈరోజు స్వామి వారు మనింటికి వస్తున్నారు , అందరు మర్యాదగా చక్కగా ఉండాలి  అని పిల్లలకు చెప్పింది. ఇల్లంతా శుభ్రంగా కడిగించింది. ముగ్గులు పెట్టారు. గుమ్మాలకు మంగళ తోరణాలు కట్టేరు .  అంతా హడావిడి, స్వామివారి కారు ఇంటిముందు ఆగింది. డాక్టర్ అమ్మ భార్తగారు కూడా డాక్టరు.  ఇద్దరు పూర్నఖుమ్భంతో లోపలికి స్వాగతించారు. 

మిగతాది ౩ భాగంలో  

Sunday 11 December 2011

Na Jnapakalu

నా జ్ఞాపకాలు

   మాతశ్రీ 
చాల మంది భక్తులు శ్రీ స్వామివారి జీవితములో జరిగిన సంఘటనలు తెలుసుకోవాలని వున్నది,  వాటి గురుంచి "శ్రీ విశ్వగురు ప్రభ " పత్రికలో వేస్తె బాగుంటుంది అని అడిగారు.    
శ్రీ స్వామివారు సన్యసించిన తరువాత సరిగా 12 సం: విస్తృతముగా పర్యటించారు. ఆ సేతు హిమాచల పర్యంతం సంచారం చేసారు. ఆంధ్ర రాష్ట్రంలో చాల ప్రదేశాలలో వారు మధురాతిమదురంగా ఉపన్యాసాలు ఇచ్చారు. 1962 లో సన్యసించిన స్వామి 1974 వరకు పర్యటించారు. శ్రీ స్వామి వారి పరిచయం మాకు 1965 లో ఐయ్నది. కనుక 1965 నుండి  74 లోపు జరిగిన వారి జీవిత సంఘటనలలో నాకు జ్ఞాపకం ఉన్న వాటిలో కొద్ది సంఘటనలు ప్రస్తుతం పాఠకులకు అందిస్తున్నాను.
శ్రీ విద్యారణ్య భగవానుల వారు ఆ రోజులలో శ్రీ విద్యారణ్య స్వామివారిగా అందరికి తెలుసు. స్వామిజి అతిచిన్న వయస్సులోనే సన్యాసం తీసుకున్నారని ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇస్తారని ఇలా ఇలా ఆనోటా ఆనోటా తెలుసుకొని, వారు వారు పెట్టుకున్న కార్యక్రమాలకు శ్రీ స్వామివారిని ఆహ్వానిఇంచే వారు.  సభకు అద్యక్ష స్థానంలో శ్రీ స్వామివారిని ఉంచి, ఉపన్యాసకులుగా, కవులుగా, పండితులుగా మంచి పేరును సంపాదించుకున్న వారిని ఏర్పాటు చేసుకున్డే వారు కొంతమంది. శ్రీ స్వామి వారి ఉపన్యాసం వింటున్న కవులకు, పండితులకు వారికీ గూడా తెలియని ఎన్నో వేదాంత రహస్యాలు శ్రీ స్వామివారు చెప్తుంటే  అస్చ్యర పోయేవారు. నవ్వుతు తన్మయంగా వినేవారు.  ఇలా జరుగుతున్నరోజులలో గుంటూరు బ్రోదిపేటలో ఉన్న ఓంకార క్షీత్రం లో సభ్యులు శ్రీ స్వామివారిని తమ సప్తాహ ఉత్శావలకు ఆహ్వానించే వారు. భగవద్గీత, వివేకచూడామణి, పంచదసి లాంటి వేదాంత గ్రంథాలఫై అద్భుతంగా ఉపన్యసించే వారు. ఒక్క ఉప్న్యసవేలలోనే కాక విడిగా కూడా వారున్న గదికి దర్శనార్ధం ఎందరో వచ్చే వారు.  ఇలా క్షీత్రానికి స్వామి వచ్చినప్పుడల్లా ఎంతో ఇష్టంగా వారిని దర్శిన్చుకోడానికి  చిన్న, పెద్ద, స్త్రీ పురుషులు అందరు వచ్చే వారు,. 
అందరిలా మేము కూడా వారి దర్శనానికి వెళ్ళాము. ఏమిటో వారిని దర్శించిన మొదటిసారి "ఎక్కడో హిమాలయాలలో తపస్సు చేసుకొనే వారిలాగా అనిపించారు. వారి మాట తీరు కూడా వేరుగా అనిపించింది. వారి రెండు కళ్ళకు మధ్య అంటే భ్రూ మద్యమంలో గొప్ప తేజస్సు కనపడింది. స్వామిలో ఏదో విశేషం ఉందనిపించింది. క్షేత్రానికి వారు వస్తే తప్పనిసరిగా దర్శించుకొనే వారం. మా లాగే ఇతర భక్తులు వచ్చే వారు. కాలం ఇలా జరుగుతున్నది. దర్శనానికి వచ్చిన ఇతర భక్తులకు భోదలు చేస్తుంటే వినే వాళ్ళం. సాయంత్రంపూట గుడి వారి programme ప్రకారం ఏర్పాటు చేసిన సభలలో అందరికి చెప్తున్నప్పుడు వినే వాళ్ళం. points note చేసుకోవాళ్ళం.
స్వామివారి దర్శనానికి ఏ కట్టడి లేదు. సమయ నిర్దేశం కూడా లేదు. ఇతర ఊళ్ళ నుంచి అర్ధరాత్రి వచ్చినా  భక్తులకు దర్శనం ఇచ్చేవారు. చిన్న వారి దగ్గరనుండి పెద్దవారి వరకు అందరికి స్వేస్చే. (freedom ).  స్వామివారు చేసే భోధలు వింటె చాలు. అందరి మనస్సులు చాల వరకు ఆధ్యాత్మిక ప్రేరణ పొందేవి. విన్టున్నంతసేపు ఎక్కడో హృదయాంతరాలలో దాగి ఉన్న వేదాంత సంస్కారాలు బహిర్గతం అయ్యేవి. 
ఒక  సారి ఒక 9 సం : పిల్లవాడు స్వామి దర్శనానికి వచ్చేడు. అప్పుడు మేము, ఇతర భక్తులుకుడా వున్నాం. స్వామివారు భోధన చేస్తున్నారు. అందరు శ్రద్ధగా వింటున్నారు:::  ::: ఇంతలో పిల్లవాడు లేచి ఏమండీ స్వామి ! దేవునికోసం జీవించటమే గొప్ప నేనుకూడా మీలాగే వుంది పోతానండి అన్నాడు దయి ర్యంగా.  స్వామివారు  "ఏమిట్రా! నీవు నావలె వుంటావా!  మీ అమ్మ నాన్న భాధ పడతారు".  ఏంటి స్వామి "అమ్మ లేదు నాన్న లేదు" అన్నాడు. "మరి వాళ్ళు లేకపోతె నీవు ఎక్కడ నుండి వచ్చావురా? " అన్నారు స్వామి వారు. "ఏమిటి స్వామిజి భగవంతుడు అనుకుంటే వీల్లెవారు లేకున్నా పుడతనండి!" అన్నాడు. స్వామివారు నిజంగానే అస్చేర్య పోయారు. "ఓరి పిడుగా!!!!!" అన్నారు. గదిలో ఉన్నవారంత గట్టిగా నవ్వేరు.      ఆ  పిల్లవాడు నిజంగా అలా తెలిసి మాట్లాడ గలిగాడ,  కాదు అది స్వామి సన్నిధి ప్రభావం. వాడి ఎప్పటి సంస్కరాలో అలా మాట్లాడించి నై .  
చూసారా ఇఎస్కంత (మాగ్నెట్) సిల ఒక చోట ఉన్నది అంటే దాని ఆకర్షణ ప్రభావం కొంత వరకు వ్యాపించి ఉంటుంది. ఇనుపముక్కను ఆ ప్రదేశంలో ఎక్కడ ఉంచినా ఐస్కాంత సిలకు అది అతుక్కుంటుంది .  ఆకర్షించుకొనుట ఐస్కాంత లక్షణమే గాని ఇనుపముక్కడి కాదు.  స్వామి సన్నిధి, వారి జ్ఞాన విరాగ మహిమ ఆ పిల్ల వాడిని అల్లా మాట్లాడించింది.
స్వామి క్షీత్రానికి (ఆ టెంపుల్ కి ) వచ్చారని తెలిస్తే  చాలు భక్తులు సంతోషంతో దర్శనానికి వచ్చే వారు. చాల వృద్దులు గూడా వచ్చే వారు. కస్టపడి మెడ మెట్లు ఎక్కుతూ (మోకాళ్ళ నెప్పులు భరిస్తూ) ఆయాసపడుతూ వారి దగ్గరికి వచ్చే వారు. స్వామి! నమస్కారాలు అంటూ కింద చతికిలపడి కూర్చునేవారు. స్వామి వారికీ చాల భాద కలిగేది. "ఎందుకండీ మీకింత కష్టం? క్రింద వుండే నమస్కారాలు చేసుకోవచ్చు కదా !" అనే వారు.  "అయ్యా! స్వామీ, అల్లా అనకండి మీరు వచ్చారని తెలిసి కూడా దర్శించుకోకపోతే ఇంతకూ వేఎంతల భాద కలుగుతుంది" అనే వారు. "వెధవ శరీరం ఏముంది ?  మా బోంట్లకు మీ దర్శనమే అదృష్టం " అనే వారు. మీ దర్శనం, మీ చల్లటి పలకరింపులు, మీ నవ్వు, మాకు వుంటే చాలు, ఎంత అలసట ఐన మాయం ఐ పోతుంది. అల్లా అంటూనే ప్రతి రోజు దర్శనానికి వస్తువుండే  వారు.  అదే విధంగా చదువుకునే చిన్న విద్యార్ధులు వచ్చేవారు. తమ ఎదట వున్నది ఎంత  గొప్ప స్వామి! ఏమో తెలియదు !
విద్యార్ధులను చూస్తీ స్వామివారికి ఎంత హాయో ! "ఏరా వచ్చారా ?" అనే వారు. very good  అనేవారు. ఒరేయ్ ! మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తార! అనే వారు. మీలో ఎవరు చక్కగా చెప్తే  వారికీ ప్రజన్ టెషేన్! మరి అడగనా? అనేవారు. పిల్లలు ఉత్సాహంతో అడగండి స్వామి, నేను చెప్తాను,నేను చెప్తాను అంటూ బాగా సందడి చేసేవారు.  స్వామి తానుగూడ ఒక పిల్లవాడిలాగా అందరితో కలిసి పోయేవారు. ఆ ! రెడీ ! ప్రశ్న వేస్తున్నాను ! అంటూ పిల్లలకు తగ్గ ప్రశ్నలు వేసే వారు. పిల్లలు చక్కగా సమాధానం ఇచ్చేవారు. స్వామీజీ ఎన్తోసంతోషంగా నవ్వి శెభాష్ ! అని మెచ్చుకొనేవారు. తన దగ్గర వున్నపండ్లు తీసి అరేయ్ పండు మీ విఇపు వేస్తున్నాను అనేవారు. క్రిందపడకుండా క్యాచ్ చెయ్యాలి అంటూ వారికీ వేసేవారు, (సమాధానం చెప్పినవారికి చెప్పనివారికి గూడా).  కొంతసేపు మంచి మంచి శ్లోకాలు నేర్పేవారు , కొంతసేపు మహాత్ముల ఆదర్శ జీవితాలు చెప్పేవారు. ఇలా చిఇనపిల్లలు కూడా స్వామివారంటే ఏంటో ఇష్టంగా ఉండే వారు . 
ఒక్కోసారి పండితులు వచ్చే వారు .  వారు సంస్కృతంలో మాట్లాడితే స్వామివారు కూడా సంస్కృతంలో మాట్లాడేవారు.పండితులు వారి సందేహాలను సంస్కృతంలో అడిగేవారు. స్వామివారు సంస్కృతంలోనే చెప్పేవారు. ఆ పండితులు స్వామివారి వైపు విస్తుపోఇ చూసేవారు. ఇంత చిన్న వయస్సులో స్వామివారికి ఇంత శాస్త్ర జ్ఞానమా? స్వామి మాకు గూడా తోచని విషయాలు మీరెలా చెప్పగల్గుతున్నారు? అనేవారు.
ఒక్కోసారి స్వామి కుర్చీలో కాళ్ళు ముడుచుకుని కూర్చునేవారు. కొందరు భక్తులు స్వామి ఇలా కాల్లుముడుచుకొనే కూర్చుంటే ఎలా ? మేము ఎలా తరిస్తాం? మేము తరించాలంటీ మా శిరస్సులు మీ పాదాలను స్ప్రుసించాలి అంటూ స్వతంత్రంగా వారి కాళ్ళను దింపి వారి వారి శిరస్సులను స్వామి పాదాలపై ఉంచేవారు. ఇలా చేయటం స్వామికి కోపం తెప్పిస్తుందని భయపడే వాళ్ళం  కాని ఎంతో ఆహ్లాదకరంగా నవ్వి ఎలా ఉన్నారు అంటూ అందరిని పేరు పేరునా పలకరించేవారు.   
మిగతాది తరువాయి భాగంలో .....................2 లో  ........



 


Thursday 15 September 2011

swamiji introduction

           .                  విద్యారణ్య స్వామిజి గారు నరసరావు పెట్ . గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. ఇండియా లో ఒక బ్రాహ్మణ కుటుంబము నందు జన్మ పొందిరి. పుట్టినది ఆదిగా వారు ఒక ప్రత్యెక మైన రీతిలో కనబుడుతుండేవారు .ఎవరికిని అంతగా అర్థం చేసుకొనుటకు సులభ తరముగా ఉండ కుండిరి .   వారి మాటలు గాని, చేతలు గాని ప్రత్యేకముగా  ఉండెడివి. వారిని ముట్టుకోనినచో ఒక విధమైన షాక్ వలె తగిలెదిట.  వారు కొటప్ప  కొండ మరియు నరసరావు పెట్ మధ్య తిరుగుతూ వుండేటి వారట.  వారి లోకములో వారు నిమగ్నమై తనే పరమాత్మ అని చెప్పుతూ ఉండు వారట. అంతు చిక్కని వారి మాటలు కొద్దిమందికే అవగాహనా అయ్యేవి .  అటువంటి వారిలో ముఖ్యులు బ్రహ్మశ్రీ  వలివేరు సత్యనారాయణ శాస్త్రి గారు., శ్రీ డి. గోపాలరావు గారు .  వీరు ఇప్పటికిని వారి చేతలు, వివరిస్తూ వుంటారు. ఆశ్రమం లో ఉండే ముగ్గురు మాతజిలు  స్వామి గారి అంతే వాసులు .  అందులో ఉండే ఒక మాతాజీ ఈ మధ్య కాలంలో సిద్ది పొందారు .  వారు ప్రతి నెల ఒక మాస పత్రిక విడుదల చేస్తుంటారు.      మిగత విషయాలు తదుపరి పోస్ట్ లో